Chali Rathiri Eduru Chuse Song Lyrics

Song: Chali Rathiri Eduru Chuse
Singer: Unknown
Lyrics: Unknown
Music: Unknown

Chali Rathiri Eduru Chuse Song Lyrics

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే

పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య 2
పుట్టాడురో మనకోసం 2

పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు 2
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో 2 ” చలి “

చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు ” చలి “

You may also like...