Nachav Abbai Song Lyrics in Telugu
Song: Nachav Abbai
Singer: Dhanunjay & Lipsika
Music: Mani Sharma
Lyrics: Bhaskara Bhatla
Nachav Abbai Song Lyrics in Telugu
నచ్చావ్ అబ్బాయ్… నచ్చావ్ అబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా… నచ్చావబ్బాయ్
నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్
ఏం చేస్తాం నువ్వు చెబితే విందామని
చూస్తూ చూస్తూ ఉన్నాలే
నీ వల్ల అది జరిగే పని కాదని
నేనే బయట పడ్డాలే
తస్సా దియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే… గుండె లయ
తస్సా దియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్
పెదవులలో ఎపుడు వినని పదాలే
పలికెనుగా తొలిగా
కన్నులలో ఎపుడు కనని కలేదో
కదిలెనుగా జతగా
నువ్వు నా చేతుల్లో… నేను నీ రాతల్లో
ప్రాణం పరాకులో పడుతుందే
నేను నీ మైకంలో… నువ్వు నా లోకంలో
ప్రేమ హడావిడి పెడుతోందే
ఇద్దరిలోనా నిద్దురపోని
తతంగమే తమాషాగుందే
తస్సాదియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సాదియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
విడివిడిగా మనమే గడిపే క్షణాలే
కలివిడిగా మారే
హే, తడబడుతూ తిరిగే మనసుకు
ఇవాళే దొరికెనుగా దారే
ఇలా ఉన్నట్టుండి… నీపై బెంగేమిటో
ఇది ఈ రోజుతో అయిపోదే
అలా అంటూ ఉంటే… హాయిగుందేమిటో
ఏది మల్లి మల్లి అనరాదే
మాటలతోనే మంత్రం వేసి
అన్ని నాతో చెప్పిస్తున్నావే
తస్సాదియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సాదియ్యా… తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్