Thanayula Pai Thandri Krupa Song Lyrics

Song: Thanayula Pai Thandri Krupa
Singer: Unknown
Lyrics: Unknown
Music: Unknown

Thanayula Pai Thandri Krupa Song Lyrics

పల్లవి : దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం (2)
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం (2)
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఓడి ఆయెగా (2)

స్తుతియే ధ్యాసగా – త్యాగమే శ్వాసగా (2)
అపురూప బంధాల సౌధముగా
అణువణువు పులకించె మధురిమగా (2)
మర్మాల నిధిగా – ప్రవహించే జీవనదిగా (2)
ఎండిన బ్రతుకుల జీవింపజేసే
జీవాలయం ఈ దేవాలయం(2)

వాక్యమే నడతగా – ఆత్మయే సారథిగా (2)
చిగురించి ఆశల కోవెలగా
చిరకాల వాసమై నిలిచెనుగా (2)
యేసయ్యే గురిగా – ఆనందాల ఝరిగా (2)
అన్ని వేళల ఆదరించే
నిత్యాశ్రయం ఈ దేవాలయం
దేవాలయం ప్రార్థనాలయం (2)

You may also like...